logo

తప్పని డోలీమోత

రహదారి సదుపాయం సక్రమంగా లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనుడిని ఆసుపత్రికి ఐదు కిలోమీటర్ల దూరం డోలీమోతతో తీసుకెళ్లారు. జి.మాడుగుల మండలం బంగారుగుడి గ్రామానికి చెందిన పాంగి భీమన్న

Published : 21 Jan 2022 04:10 IST


భీమన్నను డోలీలో ఆసుపత్రికి తరలిస్తున్న కుటుంబసభ్యులు

జి.మాడుగులే: రహదారి సదుపాయం సక్రమంగా లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనుడిని ఆసుపత్రికి ఐదు కిలోమీటర్ల దూరం డోలీమోతతో తీసుకెళ్లారు. జి.మాడుగుల మండలం బంగారుగుడి గ్రామానికి చెందిన పాంగి భీమన్న మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఐదు కిలోమీటర్ల దూరం సొలభం వరకు కుటుంబీకులు డోలీమోతతో తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనంలో జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని