logo

ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా కరణం కృష్ణ

నగరానికి చెందిన సీనియర్‌ న్యాయవాది కరణం కృష్ణ పోక్సో న్యాయస్థానం (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Published : 21 Jan 2022 04:10 IST


కరణం కృష్ణ

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: నగరానికి చెందిన సీనియర్‌ న్యాయవాది కరణం కృష్ణ పోక్సో న్యాయస్థానం (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా మైనర్లపై జరిగే లైంగిక నేరాలను విచారించే ప్రత్యేక జిల్లా న్యాయస్థానంలో ఆయన ప్రభుత్వం తరపున వాదిస్తారు. రెండున్నర దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్న కరణం కృష్ణ పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు న్యాయ సలహాదారునిగా, వివిధ క్రిమినల్‌ న్యాయస్థానాల్లో పేద ప్రజలకు చితంగా న్యాయసహాయం అందించే న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఆయన నియామకం పట్ల రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ సభ్యులు పి.నరసింగరావు, ఎస్‌.కృష్ణమోహన్‌, బైపా అరుణ్‌కుమార్‌, కె.రామజోగేశ్వరరావు, న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.ఎం.రెడ్డి, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు వైద్యుల రవీంద్రప్రసాద్‌, యల్లపు వేణుగోపాల్‌ హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని