logo

కేజీహెచ్‌లో కొవిడ్‌ కలకలం

కేజీహెచ్‌లో కొవిడ్‌ కలకలం రేపుతోంది. నర్సులు, వైద్యులు, హౌస్‌సర్జన్లు, పీజీలు, మినిస్టీరియల్‌, నాలుగో తరగతి సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. స్వల్ప లక్షణాలతో పరీక్షలు చేయించుకుంటున్న

Updated : 21 Jan 2022 04:44 IST

150 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో కొవిడ్‌ కలకలం రేపుతోంది. నర్సులు, వైద్యులు, హౌస్‌సర్జన్లు, పీజీలు, మినిస్టీరియల్‌, నాలుగో తరగతి సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. స్వల్ప లక్షణాలతో పరీక్షలు చేయించుకుంటున్న వీరికి పాజిటివ్‌ నిర్దరణ కావడంతో హోం ఐసొలేషన్‌లోకి వెళుతున్నారు. దీంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.

* కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో ప్రస్తుతం 171 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరికి వైద్య సేవలు అందించేందుకు నర్సులు, సీనియర్‌, జూనియర్‌ వైద్యులు, నాలుగో తరగతి ఉద్యోగులను నియమించారు. కేజీహెచ్‌ ఓపీ విభాగాలకు రోగుల తాకిడి పెరిగింది. కార్డియాలజీ, ప్రసూతి, పిల్లలు, సర్జికల్‌, మెడికల్‌ విభాగాలకు అధికంగా రోగులు తరలివస్తున్నారు. వారికి సేవలందించే క్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులకు వైరస్‌ వ్యాపిస్తోంది.

* ఆసుపత్రి వర్గాల లెక్కల ప్రకారం 150 మంది వరకు వైద్య సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారని సమాచారం. వీరిలో వైద్యులు 50 మంది వరకు ఉన్నారు. ప్రసూతి విభాగానికి చెందిన ఏడుగురు వైద్యులు చికిత్స పొందుతున్నారు.

* నర్సులు 50 మంది వరకు బాధితులుగా తేలడంతో నర్సింగ్‌ సేవలపై ప్రభావం పడింది. నాలుగో తరగతి ఉద్యోగులు 50 మంది వరకు కరోనాతో సతమతమవుతున్నారు. ఎక్కువ మంది ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో వేలిముద్రల హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని