logo

ప్రధాని దిగొచ్చే వరకు తగ్గేదేలే..: ఏఐటీయూసీ

ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రధాని మోదీ వెనక్కి  తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని అఖిల భారత రక్షణ రంగ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులు సి.శ్రీకుమార్‌ స్పష్టం

Published : 21 Jan 2022 04:10 IST


శిబిరంలో మాట్లాడుతున్న శ్రీకుమార్‌

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రధాని మోదీ వెనక్కి  తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని అఖిల భారత రక్షణ రంగ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులు సి.శ్రీకుమార్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన కూర్మన్నపాలెంలోని దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాలకు ఉక్కు ఉద్యమం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రక్షణ రంగంలో ఉన్న నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉక్కు పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌, డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. దీక్షలు గురువారం 343వ రోజుకు చేరుకున్నాయి. టౌన్‌ అడ్మిన్‌, అడ్మిన్‌, టీటీఐ, డబ్ల్యూఎండీ విభాగాల ప్రతినిధులు ఆర్‌.రాజేశ్వరరావు ఎ.మసేనురావు, దత్తాత్రేయరాజు, ఎ.కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని