logo

‘ఐఐపీఈ’కి 158 ఎకరాల అప్పగింత

 విశాఖ ఐ.ఐ.పి.ఇ.(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ)కి సబ్బవరం మండలం వంగలిలో కేటాయించిన 202 ఎకరాల భూమికిగానూ 158 ఎకరాలను జిల్లా రెవెన్యూ అధికారులు ఆ సంస్థకు అప్పగించారు

Published : 21 Jan 2022 04:10 IST

ఈనాడు, విశాఖపట్నం:  విశాఖ ఐ.ఐ.పి.ఇ.(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ)కి సబ్బవరం మండలం వంగలిలో కేటాయించిన 202 ఎకరాల భూమికిగానూ 158 ఎకరాలను జిల్లా రెవెన్యూ అధికారులు ఆ సంస్థకు అప్పగించారు. ఆ మేరకు మ్యూటేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. భూమి కేటాయింపుపై జాప్యం జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు ఈ నెల ఆరో తేదీన విశాఖ జిల్లా కలెక్టర్‌తో భేటీ అయ్యారు. ఐ.ఐ.పి.ఇ.కి భూమి కేటాయించినప్పటికీ మ్యూటేషన్‌ పూర్తికాలేదని వివరించారు. ఆ భూమిలోకి వెళ్లడానికి ఐ.ఐ.పి.ఇ ప్రతినిధులకు ఇబ్బందికరంగా ఉందని, వెంటనే రెవెన్యూ విభాగ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన ఆ ప్రక్రియలను అధికారులు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఐ.ఐ.పి.ఇ. డైరెక్టర్‌ ఆచార్య వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌ అభినందన లేఖలను జి.వి.ఎల్‌.నరసింహారావుకు, జిల్లా కలెక్టర్‌కు, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులకు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని