logo

కొత్త వేతనాల అమలుకు డిమాండ్‌

విశాఖ ఉక్కు కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని, పాత బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఈడీ (వర్క్స్‌) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు

Published : 21 Jan 2022 04:28 IST


ఉక్కు సీజీఎం (వర్క్స్‌) అభిజిత్‌ చక్రవర్తికి వినతిపత్రం అందజేస్తున్న అఖిలపక్ష కార్మిక నాయకులు

ఉక్కునగరం (గాజువాక), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని, పాత బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఈడీ (వర్క్స్‌) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడారు. వేతనాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు విన్నవించినా... యాజమాన్యం స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్‌జేసీఎస్‌లో జరిగిన ఒప్పందం మేరకు వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించకుంటే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

* అనంతరం ఉక్కు సీజీఎం (వర్క్స్‌) అభిజిత్‌ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. సిటూ, ఏఐటీయూసీ, ఇంటక్‌, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, వైఎస్సార్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని