logo

జాక్టో జిల్లా అధ్యక్షుడు గృహ నిర్బంధం

పీఆర్‌టీయూ, జాక్టో జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్‌ను పోలీసులు తెల్లవారుజామునే గృహ నిర్బంధం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వీల్లేదని ఆయనకు స్పష్టం చేశారు.

Updated : 21 Jan 2022 04:41 IST


డీజీనాథ్‌ను నిర్భందించిన పోలీసులు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: పీఆర్‌టీయూ, జాక్టో జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్‌ను పోలీసులు తెల్లవారుజామునే గృహ నిర్బంధం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వీల్లేదని ఆయనకు స్పష్టం చేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో డీజీ నాథ్‌ ఎస్సై నారాయణరావుకు ఫోన్‌ చేసి కలెక్టరేట్‌కు ఎటూ వెళ్లనివ్వలేదు. ఉపాధ్యాయులతో కలిసి నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి వస్తానని చెప్పడంతో ఎస్సై అంగీకరించారు. దీంతో పోలీసుల పర్యవేక్షణలోనే ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి డీజీనాథ్‌ వినతిపత్రం ఇచ్చి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని