logo

11 లక్షల స్వాహా.. ముగ్గురిపై వేటు

వెలుగు ఏపీఎం శివప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు ఆదేశాలిచ్చారు. 2011-16 మధ్య నాతవరం మండలం వెలుగు ప్రాజెక్టులో నిధుల

Published : 22 Jan 2022 02:15 IST

నాతవరం, నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: వెలుగు ఏపీఎం శివప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు ఆదేశాలిచ్చారు. 2011-16 మధ్య నాతవరం మండలం వెలుగు ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఏపీఎంపై ఆరోపణలొచ్చాయి. రూ.11 లక్షల మేర అవకతవకలు జరిగాయన్న అభియోగంపై అధికారులు విచారణ నిర్వహించారు. నాతవరం మండలంలో ఏపీవోగా పనిచేసిన శివప్రసాద్‌తోపాటు సీసీలుగా పనిచేసిన మణికుమార్‌, స్వామినాయుడుకు ఇందులో ప్రమేయం ఉందని విచారణాధికారి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. ఈ మేరకు ఆ ముగ్గుర్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. వెలుగు నర్సీపట్నం ప్రాంతీయ సమన్వయకర్త రమణకు నర్సీపట్నం ఏపీఎంగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2017లో నాతవరం మండలంలో పనిచేశానని, ఈ అవకతవకలతో తనకేమీ సంబంధం లేదని శివప్రసాద్‌ జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని