logo

ఉపాధ్యాయులపై ప్రభుత్వ తీరు అమానుషం

అధికారంలోకి రాక ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పేర్కొన్నారు.

Published : 23 Jan 2022 04:22 IST

ఎమ్మెల్సీ రఘువర్మ

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పి.రఘువర్మ

పాయకరావుపేట, న్యూస్‌టుడే: అధికారంలోకి రాక ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పేర్కొన్నారు. పాయకరావుపేటలోని జూనియర్‌ కళాశాల, ఉన్నత పాఠశాలలు సహా మండలంలోని పలు పాఠశాలలను శనివారం సందర్శించారు. ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం జగన్‌ నాడు గొప్పగా ప్రకటించారని గుర్తు చేశారు. అందరికీ అనుకూలంగా ఉండేలా పీఆర్‌సీ ఇవ్వాలని, లేనిచో సమ్మెకు సిద్ధమని స్పష్టం చేశారు. ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జూనియర్‌ కళాశాలలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులతో బోధనేతర పనులు ఎక్కువగా చేయిస్తున్నారని, మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తూ వారి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు, రాష్ట్ర కౌన్సిలర్‌ గణేష్‌, గెడ్డం సత్యనారాయణ, రహీం, శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని