logo

రైతు దగా ప్రభుత్వం

‘ఈ-క్రాప్‌ నిబంధనల పేరుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది రైతు దగా ప్రభుత్వమ’ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో ఓ....

Published : 23 Jan 2022 04:22 IST

అయ్యన్న ధ్వజం

రైతులతో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: ‘ఈ-క్రాప్‌ నిబంధనల పేరుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది రైతు దగా ప్రభుత్వమ’ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం వచ్చిన అయ్యన్న నాలుగు గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొంటామన్న అధికారులు ఈ-క్రాప్‌ పేరుతో ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. నాతవరం మండలం గునిపూడిలో 800 మంది రైతులు నమోదు చేస్తే.. 500 మంది నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన రైతుల పేర్లు ఏమయ్యాయని అడిగితే వారి నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు. తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలను మూసేసి.. గోవాడ కర్మాగారానికి చెరకు తరలించమంటున్న అధికారులు.. రైతుపై రవాణా ఛార్జీల భారం ఏమేర పడుతుందో ఆలోచించడం లేదని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని