logo

సీఎం ప్రతిపాదనలు అడిగితే మీకేం ఇబ్బంది: ఎమ్మెల్యే

ప్రతి జిల్లాలో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశిస్తే.. మీకొచ్చిన ఇబ్బందేంటని ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుని ప్రశ్నించారు.

Published : 23 Jan 2022 04:22 IST


ఉమాశంకర్‌ గణేష్‌

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రతి జిల్లాలో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశిస్తే.. మీకొచ్చిన ఇబ్బందేంటని ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుని ప్రశ్నించారు. నర్సీపట్నం విలేకరులకు శనివారం రాత్రి పంపిన వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. వైద్య కళాశాలలకు పునాదులే వేయలేదని అయ్యన్న ఆరోపిస్తున్నారు. పాడేరు వెళ్లి పునాదులు, పిల్లర్లు ఏ స్థాయికి వచ్చాయో చూడాలని సూచించారు. సుజల స్రవంతి ప్రాజెక్టు తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. ‘కొద్దిరోజులుగా అయ్యన్న వీడియో ప్రకటనలు చూస్తున్నాం. ఆయన శాడిస్టులా మాట్లాడుతున్నారు. విశాఖపట్నమో, హైదరాబాదో తీసుకువెళ్లి చూపించాలని అయ్యన్న సతీమణి పద్మావతి కోరుతున్న’ట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని