logo

ఇద్దరి చిన్నారులపై లైంగిక దాడి

అభం.. శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చోడవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Published : 23 Jan 2022 04:31 IST

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: అభం.. శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చోడవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఈ నెల 17న 4, 6 ఏళ్ల వయస్సు గల బాలికలు ఇంటి సమీపంలో ఆడుకుంటున్నారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలుడు వీరిని తన ఇంటికి తీసుకుని వెళ్లి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల్లో ఓ బాలిక జరిగిన విషయాన్ని ఆలస్యంగా తన తల్లికి చెప్పడంతో శనివారం బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు ఆ బాలుడిని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. అదనపు ఎస్సై యమునా బాలికలతో పాటు వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అసభ్యకర ప్రవర్తనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విభీషణరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని