logo

‘ఆర్థిక ప్రగతిలో హెచ్‌పీసీఎల్‌కూ పాత్ర’

భారతదేశ ఆర్థిక ప్రగతికి హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన చమురుశుద్ధి కర్మాగారం చేయూతనిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల....

Published : 23 Jan 2022 04:54 IST

రిఫైనరీలో పర్యటిస్తున్న కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి, ఇతర అధికారులు

సింధియా, న్యూస్‌టుడే: భారతదేశ ఆర్థిక ప్రగతికి హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన చమురుశుద్ధి కర్మాగారం చేయూతనిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి అన్నారు. శనివారం ఆయన హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీని సందర్శించారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం, పనితీరు, విస్తరణపై అధికారులతో సమీక్ష జరిపారు. తొలుత ఆయనకు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.రతన్‌రాజ్‌, వీఆర్‌ఎంపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.వీరభద్రరావు స్వాగతం పలికారు. పరిశ్రమ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆయన గాంధీగ్రామ్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి పునఃనిర్మాణ పనులను పరిశీలించి, ఎన్‌ఎస్‌టీఎల్‌ను సందర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని