logo

చిత్ర వార్తలు

విశాఖ రుషికొండ బీచ్‌ వద్ద సముద్రంలో స్కూబా డైవింగ్‌ విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే కొందరు ఔత్సాహికులు స్కూబా డైవింగ్‌ చేస్తూ ఆ తీరంలో కనిపించే జెల్లీఫిష్‌ అందాలను సైతం తమ కెమెరాల్లో శనివారం బంధించారు.

Updated : 23 Jan 2022 05:32 IST

 స్కూబా డైవింగ్‌లో... జెల్లీ అందాలు..

విశాఖ రుషికొండ బీచ్‌ వద్ద సముద్రంలో స్కూబా డైవింగ్‌ విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే కొందరు ఔత్సాహికులు స్కూబా డైవింగ్‌ చేస్తూ ఆ తీరంలో కనిపించే జెల్లీఫిష్‌ అందాలను సైతం తమ కెమెరాల్లో శనివారం బంధించారు. ఆ దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు.

-న్యూస్‌టుడే, సాగర్‌నగర్‌


సింహగిరుల్లో... హిమసిరులు!

శనివారం ఉదయం భారీగా కురిసిన మంచుకు సింహాచలంలోని కొండల నడుమ అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి. గిరులను మంచుతెరలు మేఘాల్లా అల్లుకున్నాయి.

-న్యూస్‌టుడే, సింహాచలం


విగ్రహాల శుభ్రత ఆరంభం

విశాఖ సాగర తీరంలో దేశ నాయకుల విగ్రహాలపై నెలలు తరబడి దుమ్ముపేరుకుపోవడంతో... వాటిని చూసిన వారు...అది ఏ నేతదో వెంటనే పోల్చుకోలేకపోతున్నారు. పక్షుల రెట్టలు పడినా ఎవరూ పట్టించుకోకపోవడంతో విమర్శలూ వస్తున్నాయి. ఈ సమస్యను గుర్తించిన అధికారులు విగ్రహాలను శుభ్రం చేసే పనులు కొనసాగిస్తున్నారు.

- ఈనాడు, విశాఖపట్నం


కొండల నడుమ హిమసాగరంలా

విశాఖ పరిసరాల్లో దట్టమైన మంచు కురిసి ఆహ్లాదకర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. శనివారం ఉదయం 8.30 గంటల వరకూ మంచుతెరలు వీడలేదు. రోడ్లపై కంటి ముందు రెండడుగుల దూరంలోని మనిషి కూడా కనిపించనంత పరిస్థితి ఏర్పడింది. పద్మనాభం, సింహాచలం, తదితర కొండ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో హిమసాగరంలా మారిన తీరు చూపరులను ఆకట్టుకుంది. మన్యంలో మాత్రమే కనిపించే అలాంటి దృశ్యాలు ఇక్కడా కనిపించడంతో ప్రకృతి ప్రేమికులు మైమరచిపోయారు.

- న్యూస్‌టుడే, పద్మనాభం, సింహాచలం 


హార్బర్‌లో ఢీకొన్నా... ఏమీకాకుండా

విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లను నిలిపే సమయంలో ఒకదానికొకటి తగిలే క్రమంలో అవి దెబ్బతింటున్నాయి. దీంతో ఆ సమస్యనుంచి కొంతైనా బయటపడేందుకు ఓ బోటు నిర్వాహకులు దాని చుట్టూ ఇలా దాదాపు 60 టైర్లు కట్టారు.

-ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని