logo

ఐ.పి.ఎస్‌. జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ ఎన్‌.ఎన్‌.రాజు

అఖిలభారత మానసిక వైద్యుల సంఘం (ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ/ఐ.పి.ఎస్‌.) జాతీయ అధ్యక్షుడిగా నగరానికి చెందిన డాక్టర్‌ ఎన్‌.ఎన్‌.రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు.

Published : 23 Jan 2022 05:37 IST


ఐ.పి.ఎస్‌.జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ ఎన్‌.ఎన్‌.రాజును సన్మానిస్తున్న డాక్టర్‌ జి.ఎస్‌.పి.రాజు,
డాక్టర్‌ కె.ఎన్‌.రెడ్డి, డాక్టర్‌ మానస, డాక్టర్‌ గౌతం సాహ, డాక్టర్‌ టి.ఎస్‌.ఎస్‌.రావు, డాక్టర్‌ ఒ.పి.సింగ్‌

ఈనాడు, విశాఖపట్నం: అఖిలభారత మానసిక వైద్యుల సంఘం (ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ/ఐ.పి.ఎస్‌.) జాతీయ అధ్యక్షుడిగా నగరానికి చెందిన డాక్టర్‌ ఎన్‌.ఎన్‌.రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని ఓ హోటల్లో పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ గౌతమ్‌ సాహ అధ్యక్షతన వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా జాతీయ అధ్యక్షుడి ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ వినయ్‌కుమార్‌(పట్నా), కార్యదర్శిగా డాక్టర్‌ అరవింద్‌ బ్రహ్మ(కోల్‌కతా), కోశాధికారిగా డాక్టర్‌ అలీమ్‌సిద్ధికి(లక్నో), జర్నల్‌ ఎడిటర్‌గా డాక్టర్‌ ఒ.పి.సింగ్‌(కోల్‌కతా)లు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించాలని భావించినప్పటికీ కొవిడ్‌ తీవ్రత పెరగడంతో కార్యక్రమాన్ని రద్దు చేశారు. కొద్దిమందితోనే వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. వార్షిక సమావేశాల్లో భాగంగా జరిగే ఇతర కార్యక్రమాలన్నింటినీ ఆన్‌లైన్లో పూర్తిచేశారు. మానసికవైద్యరంగంలో విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారాన్ని విజయవాడకు చెందిన డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డికి ప్రకటించారు. ఆయన వచ్చే సంవత్సరం భవనేశ్వర్‌లో జరిగే వార్షిక సమావేశంలో ఆ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని