logo

పంచ కల్యాణి.. పరుగులో మేటి

బంగారమ్మ జాతర సందర్భంగా రాయుడుపేటలో శనివారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పరుగు పోటీలు ఉత్సాహంగా సాగాయి.

Updated : 23 Jan 2022 05:37 IST


పోటీలో గుర్రంపై దూసుకెళ్తూ..

వేపాడ, న్యూస్‌టుడే: బంగారమ్మ జాతర సందర్భంగా రాయుడుపేటలో శనివారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పరుగు పోటీలు ఉత్సాహంగా సాగాయి. దీనిలో విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన మొత్తం 14 గుర్రాలు పాల్గొన్నాయి. పోటీల్లో మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన అన్నవరం అశ్వం విజేతగా నిలిచి రూ. 10,000 గెలుచుకుంది. జామి మండలం అలమండకు చెందిన శ్రీనురాజు గుర్రం జ్వాల రెండో స్థానంలో నిలిచి రూ. 6వేలు దక్కించుకుంది. విశాఖ జిల్లా చోడవరం నుంచి వచ్చిన మరిడిమాంబ విజయసాయికి చెందిన పంచకల్యాణి మూడో బహుమతి రూ. 5వేలు దక్కించుకుంది. మరో నాలుగింటికి నగదు ప్రోత్సాహకాలను డీసీసీబీ ఛైర్మన్‌ చినరామునాయుడు, జడ్పీటీసీ సభ్యులు అప్పలనాయుడు, గ్రామ పెద్ద అప్పారావు చేతుల మీదుగా అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని