logo

డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కరిస్తా

పట్టణంలోని డంపింగ్‌ యార్డు సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మిశ పేర్కొన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం పర్యటించారు.

Published : 23 Jan 2022 05:48 IST

అనకాపల్లిలో పర్యటిస్తున్న కమిషనర్‌ లక్ష్మీశ, అధికారులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: పట్టణంలోని డంపింగ్‌ యార్డు సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మిశ పేర్కొన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. డంపింగ్‌ యార్డును ఇక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపడతామని, అప్పటి వరకు ఇక్కడ చెత్త నిల్వ ఉండకుండా రోజూ విశాఖకు తరలిస్తామన్నారు. అనంతరం గవరపాలెం శ్మశానాన్ని పరిశీలించారు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు వసూలు చేస్తున్న ఛార్జీలపై ఆరా తీశారు. గాంధీనగరం, అన్నమయ్య, శాంతి ఉద్యానాలను అభివృద్ధి చేస్తామన్నారు. విజయరామరాజుపేట వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని చెప్పారు. అనకాపల్లి పట్టణం మధ్యలో నుంచి వెళ్తున్న పంట కాలువలను శుభ్రం చేయిస్తామన్నారు. పందుల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్చచ్చ సర్వేక్షన్‌ - 2022 ప్రదర్శనలో పాల్గొన్నారు. జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, కార్యనిర్వాహక ఇంజినీరు మత్స్యరాజు, ప్రణాళికా విభాగం అధికారి అమ్మాజీరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని