logo

చిత్రవార్తలు

ఆదివారం ఉదయం చింతపల్లిలో 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పరిశోధనాస్థానం వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల ఉష్ణోగ్రత

Updated : 24 Jan 2022 01:53 IST

మైమరిపించిన మంచు మేఘాలు

సీతమ్మ పర్వతంపై మేఘమాలిక

ఆదివారం ఉదయం చింతపల్లిలో 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పరిశోధనాస్థానం వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరోనా నేపథ్యంలో వంజంగి మేఘాలకొండకు పర్యాటకుల తాకిడి తగ్గింది. హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ సమీపంలో ఉన్న సీతమ్మ పర్వతంపై మంచు అందాలు ఆకట్టుకుంటున్నాయి.

- పాడేరు పట్టణం, చింతపల్లి, న్యూస్‌టుడే


వీరివీరి గుమ్మడి.. దీని పేరు బొప్పాయి!

బొప్పాయి ఆకారం అందరికీ తెలిసిందే. కొన్ని కాయలు విభిన్న ఆకృతుల్లో చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో గుమ్మడి కాయలా కనిపిస్తోంది బొప్పాయే. పాయకరావుపేటకు చెందిన రైతు వేముల దివాణం తోటలో కనిపించగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

- న్యూస్‌టుడే, పాయకరావుపేట


తీరం.. రాళ్లపై పచ్చలహారం..!

యారాడ సముద్ర తీరంలో ఆదివారం నీరు కాస్త వెనక్కి వెళ్లడంతో... బండరాళ్లపై పచ్చటి దుప్పటి పరిచినట్టు పేరుకుపోయిన నాచు ఆకర్షణీయంగా కనిపించింది. రాళ్ల మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి కుంటల వద్ద పర్యాటకులు సందడిగా గడిపారు.

-న్యూస్‌టుడే, మల్కాపురం (యారాడ బీచ్‌)


కళాకారుల నిరసన

చింతామణి నాటకంపై నిషేధం ఎత్తివేయాలని ఆదివారం నగరంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న జబర్దస్త్‌ ఫేమ్‌ రాపేటి అప్పారావు, తెలుగుదండు వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిశయనసూరి, ఇతర కళాకారులు.

-న్యూస్‌టుడే, మద్దిలపాలెం


లచ్చన్నకు నివాళి

ఉత్తరాంధ్ర యాత, శ్రీశైన, శెట్టిబలిజ, గౌడ, ఈడిగ సంఘీయుల ఆధ్వర్యంలో ఆదివారం గంగవరం పోర్టురోడ్డు సర్దార్‌ నెస్టు ఉత్సవ్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌతు శిరీష, తదితరులను చిత్రంలో చూడొచ్చు.

-న్యూస్‌టుడే, గాజువాక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని