logo

వైభవంగా మోదకొండమ్మ తీర్థం

మన్యం ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి తీర్థం ఆదివారం వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ

Published : 24 Jan 2022 01:38 IST

పల్లకి ఊరేగింపులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, సర్పంచి ఉషారాణి, ఆలయ కమిటీ ప్రతినిధులు

పాడేరు, న్యూస్‌టుడే: మన్యం ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి తీర్థం ఆదివారం వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం అమ్మవారి పల్లకీ ఊరేగింపులో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సర్పంచి ఉషారాణి, రాష్ట్ర ఆరోగ్య సలహా మండలి సభ్యులు డాక్టర్‌ నర్సింగరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంబేడ్కర్‌ కూడలి, మెయిన్‌ రోడ్డు మీదుగా మండల పరిషత్తు కార్యాలయం వరకు ఊరేగింపు సాగింది. బాణసంచా కాల్పులు, డప్పు వాయిద్యాలు, నేలవేషాలతో ఊరేగింపు నిర్వహించారు. పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు ఎమ్మెల్యే, సర్పంచి నగదు బహుమతులు అందించారు. సీఐ సుధాకర్‌, ఎస్సై లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీపీ నాగమణి, మాజీ ఎంపీపీ ఉషారాణి, మాజీ సర్పంచి పిన్నయ్యదొర, గ్రామ పెద్దలు సుబ్బారావు, ప్రసాద్‌, శ్రీను, రత్నం, బాబూరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని