logo

విశాఖలోనే మోల్నుపిరావిర్‌ ఔషధాల తయారీ

మోల్నుపిరావిర్‌ ఔషధాన్ని విశాఖలోనే తయారు చేయనున్నట్లు బయోఫోర్‌ సంస్థ సీఈవో డాక్టర్‌ జగదీశ్‌బాబు రంగిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బయోఫోర్‌ సంస్థ మోల్నుపిరావిర్‌ తయారీకి ‘మెర్క్‌ అండ్‌ కో ఇంక్‌‘ సంస్థ విభాగమైన

Published : 24 Jan 2022 02:17 IST

బయోఫోర్‌ సంస్థకు అనుమతులు

ఈనాడు, విశాఖపట్నం: మోల్నుపిరావిర్‌ ఔషధాన్ని విశాఖలోనే తయారు చేయనున్నట్లు బయోఫోర్‌ సంస్థ సీఈవో డాక్టర్‌ జగదీశ్‌బాబు రంగిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బయోఫోర్‌ సంస్థ మోల్నుపిరావిర్‌ తయారీకి ‘మెర్క్‌ అండ్‌ కో ఇంక్‌‘ సంస్థ విభాగమైన ‘మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌’(ఎం.పి.పి.) నుంచి అనుమతి (సబ్‌ లైసెన్సు) పొందిన నేపథ్యంలో ఆ ఔషధాన్ని విశాఖలోనే తయారు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఆ ఔషధాన్ని వారం రోజుల్లోనే మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశ వ్యాప్తంగా మార్కెట్‌ చేయడంతోపాటు 104 ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సంస్థకు అనుమతులు లభించాయని తెలిపారు. తేలికపాటి నుంచి ఒక మోస్తరు కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్నవారు మోల్నుపిరావిర్‌ ‘యాంటీ వైరల్‌’ నోటి మాత్రలు తీసుకుంటే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం గణనీయంగా తగ్గితుందని పేర్కొన్నారు. 40 మాత్రలను రూ.1500ల ధరకు విక్రయించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని