logo

కొవిడ్‌.. శరవేగంగా..!

జిల్లాలో కొవిడ్‌ శరవేగంగా వ్యాపిస్తోంది.. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అయితే ఆసుపత్రుల్లో చేరికలు పెద్దగా లేకపోవడం కొంత ఊరట కలిగిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం

Published : 24 Jan 2022 02:17 IST

తాజాగా 2258 కేసుల నమోదు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ శరవేగంగా వ్యాపిస్తోంది.. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అయితే ఆసుపత్రుల్లో చేరికలు పెద్దగా లేకపోవడం కొంత ఊరట కలిగిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 5657 నిర్ధారణ పరీక్షలు చేశారు. 39.92శాతం చొప్పున 2258 మందికి పాజిటివ్‌గా తేలింది. గత మూడు రోజుల నుంచి పాజిటివిటీ రేటు స్థిరంగా కొనసాగుతోంది.
* వరుసగా మూడో రోజూ కేసుల నమోదులో జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మొదటి, రెండో దశల్లో జిల్లా 8వ స్థానంలో ఉంటే ఈసారి మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత 24గంటల వ్యవధిలో ఒకరు మృతి చెందారు. కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో 2040 పడకలను అందుబాటులోకి తెచ్చారు.
* నగర పరిధిలోని విశాఖ ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలకు ముడసర్లోవలోని హుద్‌హుద్‌ కాలనీ, విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాలకు బక్కన్నపాలెంలోని హుద్‌హుద్‌కాలనీలను కేర్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల నిర్వహణకు జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ మల్లాది ఎస్‌.శర్మను నియమించారు. స్వల్ప లక్షణాలతో కొవిడ్‌ బారిన పడ్డ వారు ఆయా కేంద్రాల్లో ఉండవచ్చు. అల్పాహారం, ఆహారం, తాగునీరు. ఔషధాలు ఉచితంగా అందజేస్తారు. ఆరోగ్యం విషమిస్తే సమీపంలోని కొవిడ్‌ ఆసుపత్రికి తరలిస్తారు. ఆయా కేంద్రాల్లో ఇంకా ఎవరూ చేరలేదు. మొత్తం కేసుల్లో 241 మంది ఆసుపత్రుల్లో, 15,454 మంది హోంఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
మొత్తం బాధితులు: 1,78,111
కోలుకున్న వారు: 854
ఇప్పటి వరకు డిశ్ఛార్జి: 1,61,289
మృతులు: 1, మొత్తం మృతులు: 1127

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని