logo

మధ్య వయస్సు ఓటర్లే అధికం

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైంది. ఈ హక్కు సద్వినియోగంతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. జిల్లాలో ఏటికేడు ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ఇందులో మధ్య వయస్సు ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. 19, 29 ఏళ్ల లోపు విభాగంలో పురుషుల ఓట్లు అధికంగా ఉంటే మిగిలిన విభాగాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

Published : 25 Jan 2022 04:50 IST
యువత చేరిక అంతంతే
నేడు జాతీయ ఓటరు దినోత్సవం

కలెక్టరేట్‌ ఆవరణలో చేస్తున్న ఏర్పాట్లు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైంది. ఈ హక్కు సద్వినియోగంతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. జిల్లాలో ఏటికేడు ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ఇందులో మధ్య వయస్సు ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. 19, 29 ఏళ్ల లోపు విభాగంలో పురుషుల ఓట్లు అధికంగా ఉంటే మిగిలిన విభాగాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

* జాతీయ జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 49లక్షల వరకు ఉంది. దీని ప్రకారం యువ ఓటర్లు అంటే 18,19ఏళ్ల వయస్సు వారు కనీసం లక్షకుపైగా ఉండాలి. కానీ జిల్లాలో వీరి సంఖ్య 19,472 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో పురుషులు 11,432 మంది ఉంటే మహిళలు 8039 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.

* యువతను ఓటర్లుగా చేర్చేందుకు జిల్లా యంత్రాంగం పలు ప్రయత్నాలు చేసింది. గత ఏడాది నవంబరులో చేపట్టిన ఓటరు జాబితాల సవరణ సమయంలో కళాశాల స్థాయిలో ప్రత్యేక నమోదులు నిర్వహించారు. అధికారులు స్వయంగా కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పించారు. అయినా యువ ఓటర్ల సంఖ్య పెరగలేదు.  18ఏళ్లు నిండిన వారంతా ఓటర్లగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. జాతీయ ఓటరు సర్వీసు పోర్టల్‌ (ఎన్‌వీఎస్‌పి) ద్వారా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలో ఓటర్లపై ‘న్యూస్‌టుడే’ కథనం..

నేడు కలెక్టరేట్‌లో వేడుకలు

జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాలు మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించనున్నారు. తొలుత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అమరావతి నుంచి వీసీ ద్వారా మాట్లాడనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ప్రసంగిస్తారు. తదుపరి కొద్దిమంది యువ ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో వేడుకలు పరిమితంగా నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో షామియానాలు, కుర్చీలు, వేదిక నిర్మాణం చేపట్టి ఆవరణను సుందరంగా తీర్చిదిద్దారు.

మూడేళ్లలో 4లక్షల మేర పెరుగుదల..

మూడేళ్లలో జిల్లాలో ఓటర్ల సంఖ్య సుమారు 4 లక్షల వరకు పెరిగింది. రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. 30-80ఏళ్లు పైబడిన ఓటర్లలో వీరి సంఖ్యే ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని