logo

మైలాన్‌ లేబొరేటరీస్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ వితరణ

కొవిడ్‌ రోగులకు వైద్య సేవల్లో భాగంగా ఆక్సిజన్‌ కొరత లేకుండా మైలాన్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రూ.55లక్షలతో నిర్మించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఎ.ఈ. ప్రమోద్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.

Published : 25 Jan 2022 04:50 IST

ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ప్రమోద్‌కుమార్‌రెడ్డి, మల్లికార్జునరావు తదితరులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : కొవిడ్‌ రోగులకు వైద్య సేవల్లో భాగంగా ఆక్సిజన్‌ కొరత లేకుండా మైలాన్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రూ.55లక్షలతో నిర్మించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఎ.ఈ. ప్రమోద్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఎంవీపీకాలనీ మెడికవర్‌ ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేకుండా రోగులకు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఈ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను నిర్మించినట్లు మైలాన్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ హెచ్‌.ఆర్‌. విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.మల్లికార్జునరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనిట్‌9 విభాగాధిపతి సునీల్‌రాయ్‌ వాద్వా, అసోసియేట్‌ ఉపాధ్యక్షులు జి.సరస్వతి రావు, అంజనీకుమార్‌, ఎ.శ్రీనివాస్‌, మెడికవర్‌ ఆసుపత్రి ప్రాంతీయ విభాగాధిపతి ఎన్‌.పద్మజ, ఎంవీపీ ఆసుపత్రి విభాగాధిపతి మయూఖ్‌ చౌదురి, మైలాన్‌ లేబొరేటరీస్‌ ఉద్యోగులు ఆర్‌.బద్రీనాద్‌, బ్రహ్మాజీ, కె.శ్యామ్‌ప్రసాద్‌, వినీల్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని