logo

ఆన్‌లైన్‌లోనే ఇగ్నో కోర్సులు

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జనవరి - 22 సెషన్‌ నుంచి ఎన్నో ఆన్‌లైన్‌ కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ జి.ధర్మారావు వెల్లడించారు. ఎ.ఐ.సి.టి.ఈ. గుర్తింపు ఉన్న ఎంబీఏ, యూజీసీ గుర్తింపు పొందిన పీజీ కోర్సులు,

Published : 25 Jan 2022 04:50 IST

ధర్మారావు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జనవరి - 22 సెషన్‌ నుంచి ఎన్నో ఆన్‌లైన్‌ కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ జి.ధర్మారావు వెల్లడించారు. ఎ.ఐ.సి.టి.ఈ. గుర్తింపు ఉన్న ఎంబీఏ, యూజీసీ గుర్తింపు పొందిన పీజీ కోర్సులు, ఆంగ్లం, హిందీ, జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, గాంధీ అధ్యయనం, బీసీఏ, బీకాం, లైబ్రరీసైన్స్‌, బీటీఎస్‌, సోషల్‌ వర్క్‌ తదితర డిగ్రీ కోర్సులు ప్రస్తుతం పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంలోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్‌ కోర్సులన్నింటికీ పాఠ్యాంశాలు, బోధన, మూల్యాంకనం పూర్తిగా అంతర్జాల మాధ్యమంలోనే ఉంటాయని, విద్యార్ధులు ఏ అధ్యయన కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ్త ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి ఇగ్నో వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌, ఇ-జ్ఞాన్‌కోశ్‌, జ్ఞాన దర్శన్‌, జ్ఞాన్‌ ధార, జ్ఞాన్‌వాణి, ఈ లైబ్రరీ తదితర సేవల ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తారని పేర్కొన్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి నుంచి ఉన్నత విద్యను పొందాలనుకునే వారికి ఈ కోర్సులు ఎంతగానో ఉపకరిస్తాయని, ఇతర వివరాలకు ఎంవీపీ కాలనీలోని ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని