logo

మంత్రి కొడాలి నానిని బర్తరఫ్‌ చేయాలి: అనిత

నిన్నటి వరకు ఏపీ అంటే గంజాయి, డ్రగ్స్‌ గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు గుడివాడ, అందులో క్యాసినో గుర్తుకొస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు.

Published : 25 Jan 2022 04:50 IST

క్యాసినోలో దృశ్యాలను మీడియాకు ప్రదర్శిస్తున్న వంగలపూడి అనిత

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నిన్నటి వరకు ఏపీ అంటే గంజాయి, డ్రగ్స్‌ గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు గుడివాడ, అందులో క్యాసినో గుర్తుకొస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. సోమవారం మధ్యాహ్నం విశాఖ నగర తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెదేపా హయాంలో విశాఖ బీచ్‌లో లవ్‌ఫెస్టివల్‌ నిర్వహిస్తే జగన్‌, రోజా విమర్శలు గుప్పించారని, నాటి సీఎం చంద్రబాబు స్పందించి సంస్కృతికి విఘాతం కలిగించే కార్యక్రమాలు ఉండబోవని స్పష్టంగా చెప్పారన్నారు. మరి ఇప్పుడు గుడివాడలో ఇంత జరిగినా జగన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంత్రి వర్గం నుంచి మంత్రి కొడాలి నానిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. క్యాసినో నిర్వహించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలన్నారు. లేకుంటే చలో గుడివాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా క్యాసినోలో కొడాలి నానిపై పాడిన పాటకు కార్యకర్తలు నృత్యం చేసిన దృశ్యాలను ఆమె మీడియాకు ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని