logo

‘ప్రభుత్వానిది తప్పుడు ప్రచారం’

నూతన పీఆర్సీపై అసత్యాలతో ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ విమర్శించారు. నక్కపల్లి, రాజయ్యపేట, వేంపాడు, చినదొడ్డిగల్లు, డీఎల్‌పురం గ్రామాల్లో సోమవారం పర్యటించి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.

Published : 25 Jan 2022 05:35 IST

నక్కపల్లిలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘువర్మ

నక్కపల్లి, న్యూస్‌టుడే: నూతన పీఆర్సీపై అసత్యాలతో ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ విమర్శించారు. నక్కపల్లి, రాజయ్యపేట, వేంపాడు, చినదొడ్డిగల్లు, డీఎల్‌పురం గ్రామాల్లో సోమవారం పర్యటించి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌ తుంగలో తొక్కారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రివర్స్‌ పీఆర్సీ ప్రకటించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు నష్టమే తప్ప ప్రయోజనం శూన్యమన్నారు. సమస్యల పరిష్కారానికి న్యాయపోరాటం చేస్తుంటే, సర్కారు వాస్తవాలను దాచి తప్పుడు నివేదికలను విడుదల చేసి, ఉద్యోగులపై ప్రజల్లో విద్వేషం కలిగేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతిరాజు, జిల్లా, మండల నాయకులు శ్రీనివాసరావు, కొండలరావు, అప్పలరాజు, లక్ష్మణరావు, రంగబాబు, కుందూరు రాజు, సురేష్‌కుమార్‌, వెంకటరావు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని