logo

రూ.164 కోట్ల పనులకు అనుమతులు

 మిషన్‌ కనెక్ట్‌ పాడేరులో రూ.120.24 కోట్లు, ఎల్‌డబ్ల్యూఈలో భాగంగా రూ.44 కోట్లతో పనులు ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్‌ నుంచి పరిపాలనా అనుమతులు వచ్చాయని ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ తెలిపారు.

Published : 25 Jan 2022 05:41 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే:  మిషన్‌ కనెక్ట్‌ పాడేరులో రూ.120.24 కోట్లు, ఎల్‌డబ్ల్యూఈలో భాగంగా రూ.44 కోట్లతో పనులు ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్‌ నుంచి పరిపాలనా అనుమతులు వచ్చాయని ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ తెలిపారు.  సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అధికారులతో జూమ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, తాగునీటి పథకాలు నిర్మించాలని చెకప్పారు. ఏకలవ్య పాఠశాలల నిర్మాణాలపై సమీక్షించారు. వెలుగు ఏపీడీ మురళి, 11 మండలాల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని