logo

పాఠం చెప్పిన సర్పంచి

గుడ్డిప గ్రామ సర్పంచి గుమ్మాల గణేష్‌ కుమార్‌ సోమవారం ఉపాధ్యాయుడుగా మారి పాఠాలు బోధించారు. సోమవారం గుడ్డిప ప్రాథమిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గణితంలో ‘డిఫరెంట్‌ టైప్స్‌ ఆఫ్‌ షేప్స్‌’ గురించి బోధించారు.

Published : 25 Jan 2022 05:41 IST

రావికమతం, న్యూస్‌టుడే: గుడ్డిప గ్రామ సర్పంచి గుమ్మాల గణేష్‌ కుమార్‌ సోమవారం ఉపాధ్యాయుడుగా మారి పాఠాలు బోధించారు. సోమవారం గుడ్డిప ప్రాథమిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గణితంలో ‘డిఫరెంట్‌ టైప్స్‌ ఆఫ్‌ షేప్స్‌’ గురించి బోధించారు. గణేష్‌ కుమార్‌ ఎంటెక్‌, ఎల్‌.ఎల్‌.బి. చదివారు. సర్పంచిగా ఎన్నికవక ముందు విశాఖలోని రఘు ఇంజినీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పాఠశాలను సందర్శించిన ఆయన మధ్యాహ్న భోజనం, తాగునీరు, ఇతరత్రా సౌకర్యాలు పరిశీలించారు. క్లాస్‌ టైం టేబుల్‌ పరిశీలించి అయిదో తరగతి గది విద్యార్థులు ఖాళీగా ఉండటంతో లెక్కలను బ్లాక్‌బోర్డుపై చేసి చూపించారు. అన్ని తరగతుల్లోనూ బోధన కొనసాగేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని