logo

వరించిన ఇండియన్‌ పోలీసు మెడల్‌

విశాఖ నగర పరిధిలోని కాపులుప్పాడలోని రాష్ట్ర గ్రేహౌండ్స్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బి.విజయ్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వం అందించే అత్యుత్తమ పతకమైన ఇండియన్‌

Published : 26 Jan 2022 04:10 IST

గ్రేహౌండ్స్‌ ఏసీ విజయ్‌కుమార్‌కి..

గ్రామీణభీమిలి(విశాఖపట్నం), న్యూస్‌టుడే: విశాఖ నగర పరిధిలోని కాపులుప్పాడలోని రాష్ట్ర గ్రేహౌండ్స్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బి.విజయ్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వం అందించే అత్యుత్తమ పతకమైన ఇండియన్‌ పోలీసు మెడల్‌(ఐపీఎం)కి ఎంపికయ్యారు. అమరావతిలో బుధవారం జరిగే గణతంత్ర దినోత్సవంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల చేతులమీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 1998లో సేవా పతకం, 2015 ఉత్తమ సేవా పతకాలను ఆయన అందుకున్నారు. విజయ్‌కుమార్‌ పురస్కారానికి ఎంపికవడం పట్ల పలువురు పోలీసు ఉన్నతాధికారులు హర్షం వ్యక్తంచేశారు.


ఏడీసీపీ సుబ్రహ్మణ్యంకు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రకటించిన ఇండియన్‌ పోలీసు మెడల్‌(ప్రతిభావంతమైన సేవ)కు విశాఖ నగర కమిషనరేట్‌ పరిధిలోని ఎ.ఆర్‌. విభాగంలో ఏడీసీపీగా విధులు నిర్వహిస్తున్న కె.సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ఈయన 1991లో ఆర్‌.ఎస్‌.ఐ.గా విధుల్లో చేరారు. 2019 మార్చి నుంచి సిటీ ఏఆర్‌లో సేవలందిస్తున్నారు. వి.ఐ.పి.ల భద్రతను ఈయన పర్యవేక్షిస్తున్నారు. ఎస్‌.పి.జి., ఎన్‌.ఎస్‌.జి. వంటి అత్యున్నత భద్రత విభాగాల్లో శిక్షణ పొందారు. 30 సంవత్సరాల సర్వీసులో సుమారు 48 రివార్డులు అందుకున్నారు. విధి నిర్వహణలో  అంకితభావంతో పనిచేయటంతోనే ఈ పతకానికి ఎంపికయ్యానని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హాకు కృతజ్ఞతలు తెలిపారు.


కేంద్ర కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్‌కు.. రాష్ట్రపతి అవార్డు

విశాఖపట్నం కేంద్ర కారాగారంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పెదపూడి శ్రీరామచంద్రరావుకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్‌ కరక్షనల్‌ సర్వీస్‌ మెడల్‌ వరించింది. కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో దిల్లీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి ఈ పురస్కారం పంపించనుండగా.. అమరావతిలో జైళ్ల శాఖ ఐజీ చేతుల మీదుగా దీనిని అందుకోనున్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఈ పురస్కారం మరింత బాధ్యత పెంచిందన్నారు.

-న్యూస్‌టుడే, విశాలాక్షినగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని