logo

ఏసీ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు

ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీˆ శుభవార్త తెచ్చింది. కొన్ని మార్గాల్లో కొంత కాలం పాటు ఛార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రాథమికంగా విశాఖ నుంచి మూడు

Published : 26 Jan 2022 04:10 IST

ఈనాడు, విశాఖపట్నం : ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీˆ శుభవార్త తెచ్చింది. కొన్ని మార్గాల్లో కొంత కాలం పాటు ఛార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రాథమికంగా విశాఖ నుంచి మూడు మార్గాల్లో ప్రస్తుతం ఉన్న ఛార్జీలో 20 శాతం వరకు తగ్గించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విశాఖ- ఇచ్ఛాపురం, విశాఖ-విజయవాడ, విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఏసీˆ బస్సుల్లో ఈ తగ్గింపు ఉంటుందన్నారు. వారంలో నాలుగు రోజుల పాటు దీన్ని అమలు చేయనున్నారు. రోజూ విశాఖ నుంచి హైదరాబాద్‌కు 3, విజయవాడకు 13, ఇచ్ఛాపురం రెండు ఏసీ బస్సులు వెళ్తాయి. భవిష్యత్తులో రాజమహేంద్రవరం, కాకినాడ మార్గాల్లోనూ పరిశీలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని