logo

నూతన వేతనాల్ని కోరుతూ ఉక్కులో ధర్నా

విశాఖ ఉక్కు కార్మికులకు వెంటనే నూతన వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీటీఐ కూడలిలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు,

Published : 26 Jan 2022 04:10 IST

ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతున్న అఖిలపక్ష నాయకుడు అయోధ్యరామ్‌

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కార్మికులకు వెంటనే నూతన వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీటీఐ కూడలిలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను ఉద్ధేశించి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. దేశంలోని 8 రాష్ట్రాల ఉక్కు కార్మికులకు అమలవుతున్న నూతన వేతనాలను విశాఖ ఉక్కు యాజమాన్యం అమలుకు ముందుకు రాకపోవడం అన్యాయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే యాజమాన్యం కార్మికుల ఆర్థిక ప్రయోజనాలపై నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్రంగా విమర్శించారు. విశాఖ ఉక్కును 100శాతం వ్యూహాత్మక అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు 348 రోజులుగా చేస్తున్న ఐక్య ఉద్యమాలను భగ్నం చేయాలన్న ప్రభుత్వ, యాజమాన్యాల వైఖరిని ఐక్య ఉద్యమాలతోనే తిప్పికొడతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 30వేల కోట్ల టర్నోవర్‌ సాధించే దిశగా కార్మిక వర్గం కృషి చేస్తుందని వారు వివరించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ కర్మాగారాన్ని తన తాబేదార్లకు కట్టబెట్టే ఆలోచనలోనే కేంద్రం పావులు కదుపుతోందని, దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళి కోటి సంతకాల సేకరించే ప్రణాళికలు రూపొందించుకున్నామని వారు అన్నారు. కర్మాగార రక్షణతో పాటు కార్మికుల హక్కు అయిన నూతన వేతనాలు అమలు చేయడంలో యాజమాన్యం జాప్యానికి వ్యతిరేకంగా ఈ నెల 31న సమ్మెతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు జె.అయోధ్యరామ్‌, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, గంధం వెంకటరావు, సత్యనారాయణరావు, రామ్మోహన కుమార్‌, డి.అప్పారావు, రాధాకృష్ణన్‌, నీరుకొండ రామచంద్రరావు, వి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని