logo

గణతంత్రం.. ఘనతంత్రం

దేశవ్యాప్తంగా కులాలు, మతాలకు అతీతంగా జరుపుకొనేది గణతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సార్వభౌమాధికారం ఉన్న దేశ పరిపాలనకు కొన్ని ప్రత్యేక చట్టాలు

Published : 26 Jan 2022 04:10 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

సర్వే ఫారాలు నింపుతున్న ఇంటర్‌ విద్యార్థులు

దేశవ్యాప్తంగా కులాలు, మతాలకు అతీతంగా జరుపుకొనేది గణతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సార్వభౌమాధికారం ఉన్న దేశ పరిపాలనకు కొన్ని ప్రత్యేక చట్టాలు అవసరం. దీనికి మూలమే రాజ్యాంగం. ప్రపంచంలోనే అత్యున్నతమైన లిఖిత రాజ్యాంగం మనది. విశిష్టమైన మన గణతంత్రంపై నేటి విద్యార్థుల్లో ఇంకాస్త అవగాహన పెరగాల్సి ఉంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా అనకాపల్లి జూనియర్‌ కళాశాలలోని 100 మంది విద్యార్థులతో బుధవారం ‘న్యూస్‌టుడే’ సర్వే నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలిలా ఉన్నాయి...


దేశపౌరులకు వరం రాజ్యాంగం
- సీహెచ్‌ రేవతి, ఇంటర్‌ విద్యార్థిని, అనకాపల్లి

రాజ్యాంగం దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ కల్పనకు హామీ ఇచ్చింది. అంటరానితనం, కట్టు బానిసత్వం వంటి సాంఘిక దురాచారాలను రూపు మాపడానికి వీలయింది. రాజ్యాంగం నిర్దేశాల మేరకు ప్రతి ప్రభుత్వం ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాన్ని రూపు మాపడానికి కృషి చేయాల్సి ఉంది.


జాతీయ సమైక్యతను పెంపొందించేలా..
- పి.వాసంతి, ఇంటర్‌ విద్యార్థి, అనకాపల్లి

భారత రాజ్యాంగంలో జాతీయ సమైక్యతకు పెద్దపీట వేశారు. వ్యక్తుల మధ్య కుల, మత వర్గ వైషమ్యాలకు అతీతంగా ఉండాలని రాజ్యాంగంలో ప్రకటించారు. దేశ ప్రజలంతా ఒక తల్లీబిడ్డలం, ఒకే కుటుంబ సభ్యులమన్న జాతీయ భావాన్ని పెంపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని