logo

జాతిపిత గాంధీజీ పేరిట తీర్థం

ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే..అదే రోజున కొత్తకోటలో ప్రగతి యూత్‌ జాతిపిత మహాత్మా గాంధీ తీర్థాన్ని నిర్వహిస్తుంది. కొత్తకోటకు చెందిన యువకులు 20 ఏళ్ల క్రితం ప్రగతి యూత్‌ అసోసియేషన్‌గా

Published : 26 Jan 2022 04:10 IST

నేడు కొత్తకోటలో..

జాతిపిత గాంధీజీ విగ్రహం

రావికమతం, న్యూస్‌టుడే: ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే..అదే రోజున కొత్తకోటలో ప్రగతి యూత్‌ జాతిపిత మహాత్మా గాంధీ తీర్థాన్ని నిర్వహిస్తుంది. కొత్తకోటకు చెందిన యువకులు 20 ఏళ్ల క్రితం ప్రగతి యూత్‌ అసోసియేషన్‌గా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దాతల ఆర్థిక సహకారంతో గాంధీనగర్‌లో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ముఖద్వారం, బస్‌స్టాప్‌ పక్కన గాంధీజీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఏటా గణతంత్ర దినోత్సవం రోజున అక్కడ తీర్థాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గాంధీజీ విగ్రహం పక్కనే మదర్‌ థెరిస్సా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం విగ్రహాలను ఏర్పాటు చేశారు. బుధవారం గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిపించి, సాయంత్రం తీర్థం నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులకు వాలీబాల్‌, వ్యాసరచన, స్లో సైకిల్‌, స్పీడ్‌ సైకిల్‌, స్లో బైక్‌, స్పీడ్‌ బైక్‌, ముగ్గుల తదితర పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్టు ప్రగతి యూత్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

మదర్‌ థెరిస్సా, అబ్దుల్‌ కలాం విగ్రహాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని