logo

పర్వతం.. రాజుకు దాసోహం

 పూర్వీకులు ప్రాణాలను పణంగా పెట్టి చేపల వేట సాగించే కుటుంబం నుంచి వచ్చిన గోసల రాజుకు పర్వతారోహణ అంటే  మక్కువ. నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన దేముడు, రాముతల్లి చిన్న కొడుకే రాజు. ఆటలంటే

Published : 26 Jan 2022 04:10 IST

మత్స్యకార యువకుడు రాజుకుఅవార్డులతో గుర్తింపు

నక్కపల్లి, న్యూస్‌టుడే:  పూర్వీకులు ప్రాణాలను పణంగా పెట్టి చేపల వేట సాగించే కుటుంబం నుంచి వచ్చిన గోసల రాజుకు పర్వతారోహణ అంటే  మక్కువ. నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన దేముడు, రాముతల్లి చిన్న కొడుకే రాజు. ఆటలంటే మక్కువ. రన్నింగ్‌, యోగాపై శ్రద్ధపెట్టేవాడు. ఇంటర్‌ చదువుతుండగానే నాలుగేళ్ల కిందట ఎవరెస్ట్‌ పర్వతారోహణకు అవకాశం రాగా జిల్లా వ్యాప్తంగా రాజుతో పాటు సుమారు 70 మంది ఎంపికయ్యారు.   ప్రత్యేక శిక్షణలో భాగంగా గోడలు, గుట్టలు ఎక్కడం, రన్నింగ్‌లో తర్ఫీదు పొందారు.  అనంతరం కశ్మీర్‌ ప్రాంతంలో లద్దఖ్‌లో 20 రోజుల పాటు మరోసారి శిక్షణ జరిగింది. మైనస్‌ 35 డిగ్రీల చలిని తట్టుకుంటూ పర్వతం ఎలా ఎక్కాలో ఇక్కడ నేర్పించారు. దీనిలో భాగంగానే సుమారు 6153 మీటర్ల ఎత్తయిన ‘స్టాక్‌ కంగ్రీ’ పర్వతం ఎక్కించారు. తుదిగా ఎవరెస్ట్‌కు ఎంపిక చేసిన 12 మంది బృందంలో చోటు దక్కింది.
తొలిసారి 2018 మే 17న  ఎవరెస్ట్‌ శిఖరం, గైడు ఆధ్వర్యంలో ఎక్కడం ప్రారంభించి, నాలుగు రోజుల్లో లక్ష్యాన్ని చేరుకున్నారు.
రష్యాలోని మౌంట్‌ ఎలబ్రస్‌, దక్షిణమెరికాలోని మౌంట్‌ అకంగ్వా, దక్షిణాఫ్రికాలోని మౌంట్‌ కిలిమంజారో పర్వతాలనూ విజయవంతంగా ఎక్కి వచ్చాడు.

అవార్డులు ఇవే
ఎవరెస్ట్‌ ఎక్కిన తర్వాత హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ ‘ఆంధ్రా యంగెస్ట్‌ మౌంటెయినీర్‌ టు సమ్మిట్‌ ఎవరెస్ట్‌’ అవార్డును అందించింది.
హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ 2019 మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ అవార్డు.
తాజాగా ‘హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ’ జాతీయ అవార్డును ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని