logo

ఆ జీవోలతో.. ఉద్యోగులకు నిష్ప్రయోజనం

పీఆర్‌సీ అమలు చేయడానికి రాత్రి వేళ విడుదల చేసిన జీఓలను వ్యతిరేకిస్తున్నామని ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు, ఐకాస జిల్లా ఛైర్మన్‌ ఈశ్వరరావు అన్నారు. జీఓలు రద్దు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పీఆర్‌సీ సాధన సమితి

Published : 28 Jan 2022 04:51 IST

ఆందోళనలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: పీఆర్‌సీ అమలు చేయడానికి రాత్రి వేళ విడుదల చేసిన జీఓలను వ్యతిరేకిస్తున్నామని ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు, ఐకాస జిల్లా ఛైర్మన్‌ ఈశ్వరరావు అన్నారు. జీఓలు రద్దు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలేదీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ 13.50లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రయోజనంలేని జీఓలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. - హెచ్‌ఆర్‌ఏలను పక్కనపెడతామని చెప్పి కూడా, ప్రభుత్వం జీఓలను ఎలా విడుదల చేసిందని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ  తగ్గించారన్నారు. అశుతోష్‌మిశ్రా నివేదికను బయటపెట్టి, అందులోని అంశాలను అమలు చేయాలని, ఒక్క ఉద్యోగికి కూడా ప్రయోజనకరంగా లేని జీఓలను పక్కనపెట్టాలన్నారు.

జిల్లా నాయకులు ఎస్వీ రమణ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా, పాదయాత్రలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారని, ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్‌ దాన్ని విస్మరించారన్నారు. ఏపీ ఐకాస అమరావతి నేత నాగేశ్వరరెడ్డి, ప్రభుత్వ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు రమణ, ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి ధర్మేంద్రరెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చిన్నబ్బాయి, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని