logo

కార్యదర్శిపై విచారణ చేపడతాం

భీంపోల్‌ పంచాయతీ కార్యదర్శిపై ఈనెల 31న విచారణ చేపట్టనున్నట్లు డీఎల్‌పీవో కుమార్‌ తెలిపారు. గ్రామంలో లేఅవుట్‌, రిసార్ట్స్‌ నిర్మాణానికి నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శి అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై ‘ఈనాడు’లో

Published : 28 Jan 2022 04:51 IST

డీఎల్‌పీవో

అరకులోయ, న్యూస్‌టుడే: భీంపోల్‌ పంచాయతీ కార్యదర్శిపై ఈనెల 31న విచారణ చేపట్టనున్నట్లు డీఎల్‌పీవో కుమార్‌ తెలిపారు. గ్రామంలో లేఅవుట్‌, రిసార్ట్స్‌ నిర్మాణానికి నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శి అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై ‘ఈనాడు’లో గురువారం ‘ఆయన చెప్తే అడ్డగోలుగా అనుమతి’ శీర్షికన వెలువడిన కథనానికి ఆయన స్పందించారు. ఈనెల 31న సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శిపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమాలు చేస్తున్న అధికారులపై ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్‌ చర్యలు చేపట్టాలని తెదేపా నాయకులు జోగులు, ఆనంద్‌, బుజ్జిబాబు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని