logo

గోవాడకు తాండవ, ఏటికొప్పాక చెరకు

జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక కర్మాగారాల పరిధిలోని చెరకును గోవాడ కర్మాగారానికి తరలిస్తామని రాష్ట్ర సుగర్‌ కేన్‌ కమిషనర్‌ వెంకటరావు పేర్కొన్నారు. ఆశించిన స్థాయిలో చెరకు నిల్వలు లేకపోవడంతో ఈ

Published : 28 Jan 2022 04:51 IST

కమిషనర్‌ను సన్మానిస్తున్న కార్మిక సంఘ నాయకులు

చోడవరం, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక కర్మాగారాల పరిధిలోని చెరకును గోవాడ కర్మాగారానికి తరలిస్తామని రాష్ట్ర సుగర్‌ కేన్‌ కమిషనర్‌ వెంకటరావు పేర్కొన్నారు. ఆశించిన స్థాయిలో చెరకు నిల్వలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చెరకు రవాణాకు అయ్యే ఖర్చులు ఆయా కర్మాగారాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. గత ఏడాది చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిల చెల్లింపు ఆయా కర్మాగారాల ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గోవాడ కర్మాగారానికి పౌర సరఫరాల శాఖ బకాయిపడిన నగదు వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కమిషనర్‌ వెంకటరావును కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో గుర్తింపు సంఘ నాయకుడు కేవీవీ భాస్కరరావు, నాయకులు ఏడువాక సన్యాసినాయుడు, నారాయణరావు తదితరులు ఉన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్‌ సత్యనారాయణ, కర్మాగారం ఎండీ సన్యాసినాయుడు పాల్గొన్నారు.ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో ఆరు చక్కెర కర్మాగారాలే గానుగాటను ప్రారంభించాయని కమిషనర్‌ తెలిపారు. వీటిలో సహకార రంగంలో చోడవరం చక్కెర కర్మాగారం ఒక్కటే ఉందన్నారు. కర్మాగారాలు మనుగడ సాధించాలంటే మొలాసిస్‌ను ఉపయోగించి ఇథనాల్‌, బెగాస్‌ను వినియోగించి విద్యుత్తు వంటి ఉప ఉత్పత్తులు సాధించాలన్నారు.  

ఏటికొప్పాక చక్కెర కర్మాగారం నుంచి రెండు రోజుల్లో చెరకు తరలింపు ప్రారంభమవుతుందని ఎండీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమలింగపాలెం, మాకవరపాలెం, కోడూరు, కొత్తమల్లంపేట వద్ద తూనిక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గోవాడ కర్మాగారానికి రైతు నేరుగా తరలిస్తే టన్నుకు రూ.3,100 చెల్లిస్తారని, తూనిక కేంద్రం వద్దకు తరలిస్తే టన్నుకు రూ.2470 చెల్లిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు