logo

సుజుకి సరికొత్త స్పోర్టీ స్కూటర్‌ ఆవిష్కరణ

సుజుకి మోటార్‌ సైకిల్స్‌ సరికొత్త స్పోర్టీ స్కూటర్‌ ‘సుజుకి అవెనిస్‌’ను గురువారం రామాటాకీస్‌ కూడలిలోగల పద్మజ సుజుకి షోరూంలో విడుదల చేసింది. వరుణ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌దేవ్‌ చేతుల మీదుగా దీన్ని

Published : 28 Jan 2022 04:51 IST

సుజికి అవెనిస్‌ స్కూటర్‌ని ప్రారంభిస్తున్న వరుణ్‌గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌దేవ్‌

సీతంపేట, న్యూస్‌టుడే : సుజుకి మోటార్‌ సైకిల్స్‌ సరికొత్త స్పోర్టీ స్కూటర్‌ ‘సుజుకి అవెనిస్‌’ను గురువారం రామాటాకీస్‌ కూడలిలోగల పద్మజ సుజుకి షోరూంలో విడుదల చేసింది. వరుణ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌దేవ్‌ చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సుజుకి అవెనిస్‌ ప్రత్యేకించి స్పోర్టీనెస్‌ను కోరుకునే నేటి యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్‌ చేశారన్నారు. దేశీయ విపణిలో సుజుకి అవెనిస్‌ స్పోర్టీ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.86,700లు ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌, జనరల్‌ మేనేజర్‌ రఫి, డి.జి.ఎం అబ్బాస్‌, పద్మజ సుజికి సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని