Andhra News: సీఎం జగన్‌ అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందుకే నాపై కక్ష: అయ్యన్న

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తున్న అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందుకే తనపై కక్ష సాధిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్న...

Published : 01 Mar 2022 01:47 IST

నర్సీపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తున్న అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందుకే తనపై కక్ష సాధిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రడు ఆరోపించారు. తనపై ఇప్పటివరకు 9 కేసులు నమోదు చేశారన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం సరైంది కాదని అయ్యన్న హితవు పలికారు. ప్రకృతి సంపదను దోచుకొనే అధికారం వైకాపా నేతలకు లేదన్నారు. నర్సీపట్నంలో అక్రమ మైనింగ్‌ను అధికారులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఖనిజ సంపదను దోపిడీ చేయడాన్ని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు అయ్యన్న పాత్రుడు ఓ వీడియో విడుదల చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని