logo

Cyclone Asani: విశాఖ తీరం వైపు‘అసని’!

‘అసని’ తుపాను బుధవారం బలహీనపడినా క్రమంగా విశాఖ తీరం వైపు రావొచ్చన్న వాతా  వరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.గురువారం విశాఖ జిల్లాపై

Updated : 12 May 2022 09:45 IST

ఈనాడు, విశాఖపట్నం: ‘అసని’ తుపాను బుధవారం బలహీనపడినా క్రమంగా విశాఖ తీరం వైపు రావొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.

గురువారం విశాఖ జిల్లాపై తుపాను ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా. కొన్ని ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలులు  గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని...గరిష్ఠంగా 90 కి.మీ. వరకూ ఉండొచ్చు. శుక్రవారం కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలతో 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చు. వాతావరణ శాఖ గురువారం జిల్లాకు ‘రెడ్‌ ఎలర్ట్‌’ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ కార్యాలయం, జీవీఎంసీ, ఈపీడీసీఎల్‌, వైద్య, అగ్నిమాపక, పంచాయతీరాజ్‌ సిబ్బందితో ప్రత్యేక బృందాలు రక్షణ చర్యలకు సిద్ధంగా ఉంచారు. ఆయా మండలాల తహసీల్దార్లను కలెక్టర్‌ మల్లికార్జున అప్రమత్తం చేశారు.

* బుధవారం తెల్లవారుజామున జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సముద్రంలో అలజడి మాత్రం తగ్గలేదు. రుషికొండ, హార్బర్‌ ప్రాంతాల్లో అలలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. ఆకాశం మేఘావృతంగా మారినా... నగర ప్రజలు ఉక్కపోతకు గురై ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి పలుచోట్ల జోరు వాన పడడంతో వాతావరణం కాస్త చల్లబడింది.


విశాఖ జిల్లాలో బుధవారం సగటున 28 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గాజువాక మండలం మినహా మిగిలిన ఏడు మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని