logo

ఫార్మాలో చోరీల నివారణకు జాగ్రత్తలు తప్పనిసరి

పరవాడ ఫార్మాసిటీలో చోరీలు జరకుండా యాజమాన్యాలు జాగ్రతలు తీసుకోవాలని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ సూచించారు. ఫార్మాసిటీలోని ఎంఏఎస్‌ఆర్‌ఎం (మ్యూచువల్లీ ఎయిడెడ్‌ సొసైటీ ఫర్‌ రిస్క్‌ మిటిగేషన్‌) భవనం.....

Updated : 19 May 2022 04:38 IST


డీఎస్పీ సునీల్‌ను సత్కరిస్తున్న సుబ్బారావు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ ఫార్మాసిటీలో చోరీలు జరకుండా యాజమాన్యాలు జాగ్రతలు తీసుకోవాలని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ సూచించారు. ఫార్మాసిటీలోని ఎంఏఎస్‌ఆర్‌ఎం (మ్యూచువల్లీ ఎయిడెడ్‌ సొసైటీ ఫర్‌ రిస్క్‌ మిటిగేషన్‌) భవనం వద్ద బుధవారం కంపెనీల యాజమాన్య ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. హెచ్‌ఆర్‌ విభాగం, ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. కంపెనీల్లో ఏవైనా ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి పరిశ్రమలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులతో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలని కోరారు. పరవాడ సీఐ ఈశ్వరరావు మాట్లాడుతూ వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంఏఎస్‌ఆర్‌ఎం కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని