logo

పర్యాటకశాఖాధికారి కుర్చీపై కన్ను!!

విశాఖ పర్యాటకశాఖ అధికారిగా వచ్చేందుకు ఒకరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గతంలో వీఎంఆర్‌డీఏ అటవీశాఖ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి.

Published : 19 May 2022 04:32 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ పర్యాటకశాఖ అధికారిగా వచ్చేందుకు ఒకరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గతంలో వీఎంఆర్‌డీఏ అటవీశాఖ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. నిధుల ఖర్చు విషయంలో నిబంధనలు పాటించలేదన్న విమర్శలున్నాయి. అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మాతృ శాఖతో కనీస సంబంధం లేకున్నా అటవీశాఖ విభాగంలో వచ్చి ఎలా పనిచేస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీంతో అప్పటి వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ ఆయన్ను మాతృశాఖకు అప్పగించారు. తాజాగా పర్యాటకశాఖాధికారి పోస్టులోకి వచ్చేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రం పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో చురుగ్గా కదులుతోంది. ఓ అధికారి సిఫార్సుల మేరకు ఆయన్ను ఇక్కడ నియమించాలని చూస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం విశాఖ జిల్లా పర్యాటకశాఖ అధికారి పూర్ణిమాదేవి డిప్యుటేషన్‌ గడువు పూర్తయినా ఇన్‌ఛార్జిగా ఉన్నారు. తాజాగా ఈ పోస్టులోకి వచ్చేందుకు ఓ అధికారి ప్రయత్నించడం... అదీ తనకు అసలు సంబంధం లేని పర్యాటకశాఖ అధికారిగా రావాలనుకోవడం చర్చనీయాంశమవుతోంది.

పర్యాటక పరంగా విశాఖ జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎన్నో కీలక ప్రాజెక్టులు తీసుకురావడం, నిర్వహణ చేపట్టడంలో ఈ స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పర్యాటకరంగం, ప్రాజెక్టులు చేపట్టడంలో అనుభవం ఉన్న అధికారులయితే కార్యక్రమాలు సజావుగా సాగుతాయనే చర్చ సాగుతోంది.మహిళలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని