logo

జనకోలాహలంపై.. ‘హాలాహలం’!!

విశాఖ తీరంలో ప్రతి రోజూ సందడే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల్లో పిల్లలు, పెద్దలు కేరింతలతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగర జలాల్లో హుషారుగా గడిపిన  క్షణాలు ఎప్పటికీమరచిపోలేరు. కెరటాలతో  సయ్యాటలాడుతూ కుటుంబ సభ్యులంతా సంతోషంలో తడిచిముద్దవుతారు.

Published : 19 May 2022 04:32 IST

విశాఖ తీరంలో ప్రతి రోజూ సందడే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల్లో పిల్లలు, పెద్దలు కేరింతలతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగర జలాల్లో హుషారుగా గడిపిన  క్షణాలు ఎప్పటికీ
మరచిపోలేరు. కెరటాలతో  సయ్యాటలాడుతూ కుటుంబ సభ్యులంతా సంతోషంలో తడిచిముద్దవుతారు.

ఇదంతా ఓ వైపు.
మహానగరంలోని కాలువల్లో ప్రవహించి... బీచ్‌ రహదాదారి కిందున్న ప్రత్యేక మార్గాల ద్వారా దూసుకొచ్చి.... ఇసుక తిన్నెలు దాటి...అలలను తోసుకుంటూ వెళ్లి అలవోకగా కడలిలో కలిసిపోతున్న మురుగు నీటి సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇటు కోస్టల్‌ బ్యాటరీ నుంచి... అటు రుషికొండ వరకూ ఇదే పరిస్థితి.

విషతుల్య మురుగు జలాలు నిత్యం భారీగా వస్తున్నా... శుద్ధి చేసి విడుదల చేసే  ప్రక్రియ పకడ్బందీగా సాగటం లేదు. విశాఖ అంటే గుర్తుకొచ్చే ఆర్‌కే బీచ్‌ వద్దా ఇదే దారుణ పరిస్థితి.
రాష్ట్రంలో పర్యాటక రంగ చిరునామాగా ఉన్న విశాఖ కీర్తికి మచ్చరాకుండా ఉండాలంటే యంత్రాంగం సత్వరం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని  సందర్శకులు సూచిస్తున్నారు.

-ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు