logo

షిప్‌యార్డులో అగ్నిప్రమాదం

హిందుస్థాన్‌ షిప్‌యార్డు బిల్డింగ్‌ డాక్‌లో నిర్మాణ నౌకలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాలు.. పెదగంట్యాడకు చెందిన బీఎస్‌కే. అప్పారావు(40) షిప్‌యార్డులో ఓ ఇంజినీరింగ్‌ కంపెనీలో గ్యాస్‌ కట్టర్‌గా పని చేస్తున్నాడు.

Published : 19 May 2022 04:32 IST

ఒకరికి తీవ్రగాయాలు


గాయపడిన అప్పారావు

సింధియా న్యూస్‌టుడే: హిందుస్థాన్‌ షిప్‌యార్డు బిల్డింగ్‌ డాక్‌లో నిర్మాణ నౌకలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాలు.. పెదగంట్యాడకు చెందిన బీఎస్‌కే. అప్పారావు(40) షిప్‌యార్డులో ఓ ఇంజినీరింగ్‌ కంపెనీలో గ్యాస్‌ కట్టర్‌గా పని చేస్తున్నాడు. సాయంత్రం 4.30 గంటలకు బిల్డింగ్‌ డాక్‌లో నిర్మిస్తున్న డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్‌ ట్యాంకులో గ్యాస్‌ కట్టింగ్‌ పనులకు వెళ్లి గ్యాస్‌ సిలిండర్‌ వాల్వు తెరిచాడు. ఇంతలో మరో పనిపై అక్కడ నుంచి బయటకు వచ్చి, సుమారు 15 నిమిషాల తర్వాత పని ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే లీకైన గ్యాస్‌ ట్యాంకు మొత్తం వ్యాపించింది. దీన్ని గమనించని అప్పారావు పని ప్రారంభించేందుకు గ్యాస్‌ కట్టర్‌ నాజిల్‌ వద్ద నిప్పు అంటించాడు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో... అక్కడే ఉన్న అప్పారావు తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 80 శాతం గాయాలవడంతో తొలుత ఈఎస్‌ఐకి, ఆ తర్వాత కేజీహెచ్‌కు తరలించారు.

కీలక పనులను ప్రైవేట్‌ సంస్థకు ఇవ్వడం వల్లే: రక్షణ శాఖకు చెందిన రెండు డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌ (డీఎస్‌వీ) లను నిర్మించడానికి షిప్‌యార్డుకు ఆర్డర్లు దక్కాయి. వాటిలో ఓ వెసల్‌ పనులు బిల్డింగ్‌ డాక్‌లో జరుగుతున్నాయి. కీలక పనులను ప్రైవేటు గుత్తేదారుల సంస్థలకు ఇవ్వడం వల్లే యార్డులో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. 2020 ఆగస్టు ఒకటో తేదీన భారీ క్రేన్‌ పనులను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడంతోనే అప్పట్లో జరిగిన ప్రమాదంలో పది మంది దుర్మరణం చెందారని వారు గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో కీలక పనులను శాశ్వత ఉద్యోగులతో చేయించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని