logo

విశాఖలోనే నిఖత్‌ జరీన్‌ ‘పంచ్‌’లకు పదును!

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 52 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ స్వర్ణం సాధించడంతో విశాఖలోనూ సందడి నెలకొంది. జరీన్‌కు విశాఖతో అనుబంధం ఉంది.

Updated : 20 May 2022 06:10 IST

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 52 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ స్వర్ణం సాధించడంతో విశాఖలోనూ సందడి నెలకొంది. జరీన్‌కు విశాఖతో అనుబంధం ఉంది. నగరంలో భారత క్రీడాప్రాధికార సంస్ధ (సాయ్‌) సెంటర్‌లో బాక్సింగ్‌ పంచ్‌లు నేర్చుకుంది. తెలంగాణకు చెందిన జరీన్‌ బాక్సింగ్‌పై ఆసక్తి చూపి... విశాఖ కేంద్రంగా మహిళలు బాక్సింగ్‌లో రాణిస్తుండటంతో పోర్టుస్టేడియంలోని ‘సాయ్‌’ కేంద్రంలో 2010లో చేరింది. అప్పటి కోచ్‌, ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు వద్ద ప్రత్యేక శిక్షణ పొందింది. భవిష్యత్‌లో బాక్సింగ్‌ క్రీడలో జాతి గర్వపడే క్రీడాకారిణి అయ్యేందుకు నిఖత్‌ జరీన్‌కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని గుర్తించిన కోచ్‌ వెంకటేశ్వరరావు ఆమెకు ప్రత్యేక మెలకువలు నేర్పడంతో మరింత రాటుదేలింది. ప్రత్యర్థులపై పంచ్‌లు విసరడంలో తనదైన ప్రత్యేకత చాటుకుంది. 2011లో టర్కీలో జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2013లో బల్గేరియాలో యూత్‌ వరల్డ్‌ పోటీల్లో రజతం సాధించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుపొందడంతో కోచ్‌ ఐ.వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.


పట్టుదల, క్రమశిక్షణతో పాటు ప్రత్యర్థులపై అలుపెరగని పోరాటం చేయడంలో నిఖత్‌ జరీన్‌ది ప్రత్యేకపంథా అని, అవే ప్రస్తుతం ప్రపంచ బాక్సింగ్‌లో స్వర్ణం సాధించడంలో దోహద పడ్డాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని