logo

మత్స్యకారుల సమస్యలపై ఆరా

వైజాగ్‌ చేపల రేవు సమీపంలో ఉన్న జాలరిపేటను సీబీఐ మాజీ జె.డి. లక్ష్మీనారాయణ గురువారం సందర్శించారు. ‘సిటిజన్‌ రిపోర్ట్‌ కార్డ్‌-ఫోకస్డ్‌ గ్రూప్‌ డిస్కషన్‌’ కార్యక్రమంలో భాగంగా స్థానిక మత్య్స్యకాలతో మాట్లాడారు.

Published : 20 May 2022 04:54 IST

మాట్లాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: వైజాగ్‌ చేపల రేవు సమీపంలో ఉన్న జాలరిపేటను సీబీఐ మాజీ జె.డి. లక్ష్మీనారాయణ గురువారం సందర్శించారు. ‘సిటిజన్‌ రిపోర్ట్‌ కార్డ్‌-ఫోకస్డ్‌ గ్రూప్‌ డిస్కషన్‌’ కార్యక్రమంలో భాగంగా స్థానిక మత్య్స్యకాలతో మాట్లాడారు. డ్రైనేజీ, గంజాయి, మద్యం, భౌతిక దాడులు, నిరుద్యోగం వంటి వివిధ సమస్యలపై చర్చించారు. అనంతరం మత్స్యకారులు పలు సమస్యలను ఆయనకు వివరించారు. మత్స్యకార భరోసా అందడం లేదని, మహిళలకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం లేదని, వర్షాకాలంలో డ్రైనేజీల సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని