logo

భూములు దోచుకోవటానికే ప్రణాళికేమో

దేశవిదేశాల్లోని కుబేరులంతా దావోస్‌లో నిర్వహించబోయే సమావేశంలో భిక్షమెత్తుకునేందుకే వివిధ దేశాలతో పాటు మన రాష్ట్ర పాలకులు వెళ్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. ఈ సమావేశం

Published : 20 May 2022 04:54 IST

నాటి రాజధాని ప్రకటనపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శ

సమావేశంలో మాట్లాడుతున్న రాఘవులు

ఈనాడు, విశాఖపట్నం: దేశవిదేశాల్లోని కుబేరులంతా దావోస్‌లో నిర్వహించబోయే సమావేశంలో భిక్షమెత్తుకునేందుకే వివిధ దేశాలతో పాటు మన రాష్ట్ర పాలకులు వెళ్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. ఈ సమావేశం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా పెట్టుబడుల గురించి ప్రాధేయపడే దుస్థితి ఉంటుందన్నారు. ‘రాష్ట్ర విభజన దారుణంగా జరిగింది. ఓ వర్గం కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించారని, వారు అక్కడ భూములు కబ్జా చేశారని భావించి మరో వర్గం విశాఖను రాజధానిగా గతంలో ప్రకటించింది. ఇదంతా ఇక్కడి భూములు దోచుకోవడానికి చేసినట్లుగా ఉంది’ అని ఆయన ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్ర భవనాన్ని గురువారం విశాఖలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాఘవులు మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాటిని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఆగేలా ఐక్యరాజ్యసమితి తగిన పాత్ర పోషించాలన్నారు. శ్రీలంకలో పెట్రోలు కొనే పరిస్థితులు లేవు. మన దేశంలోనూ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. దేశం నుంచి గోధుమల ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు విధించారు. బియ్యం మాత్రమే వినియోగించాలని చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అర్థంకావడం లేదన్నారు సమావేశంలో పార్టీ నేతలు మధు, ఎంవీఎస్‌ శర్మ, నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని