logo

బీసీల అభ్యున్నతికి విశేష కృషి: భాజపా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీల అభ్యున్నతికి విశేషమైన కృషి చేస్తున్నారని రాష్ట్ర ఒ.బి.సి. మోర్చా అధ్యక్షులు రొంగలి గోపీశ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం దొండపర్తిలోని జీవీఎంసీ కల్యాణ

Published : 22 May 2022 03:44 IST

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీసీల అభ్యున్నతికి విశేషమైన కృషి చేస్తున్నారని రాష్ట్ర ఒ.బి.సి. మోర్చా అధ్యక్షులు రొంగలి గోపీశ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం దొండపర్తిలోని జీవీఎంసీ కల్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ఒ.బి.సి. ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బి.సి.ల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. తమ చీకటి ఆర్థిక లావాదేవీల్లో బయట రాష్ట్రంలోని నాయకుల్ని ఇక్కడకు తీసుకువచ్చి రాజ్యసభ సీట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల వారికి చేయూత ఇవ్వడానికి అనేకమంది నాయకులను భాజపా తీర్చిదిద్దుతోందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో తనను నియమించారన్నారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బి.సి. కార్పొరేషన్లను ఎందుకూ పనికిరాని వాటిగా మార్చిందన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడపాటి రవీంద్రరెడ్డి, విశాఖ జిల్లా పార్లమెంటు ఒ.బి.సి. అధక్షులు పల్లి శ్రీనివాసులునాయుడు, ఉపాధ్యక్షులు యడ్ల రమణరాజు, ఒ.బి.సి. మోర్చా నేత సనపల రామకృష్ణ, జిల్లా మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని