logo

ఆటోపై విరిగి పడిన చెట్టు

జాతీయ రహదారి బీహెచ్‌పీవీ కూడలిలో భారీ చెట్టు విరిగి పడడంతో ఒకరికి గాయాలైన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బీహెచ్‌పీవీ- నాతయ్యపాలెం సేవా మార్గంలో ఓ ఆటో ప్రయాణిస్తున్న

Published : 22 May 2022 03:44 IST

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: జాతీయ రహదారి బీహెచ్‌పీవీ కూడలిలో భారీ చెట్టు విరిగి పడడంతో ఒకరికి గాయాలైన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బీహెచ్‌పీవీ- నాతయ్యపాలెం సేవా మార్గంలో ఓ ఆటో ప్రయాణిస్తున్న సమయంలో మార్గం పక్కన ఉన్న చెట్టు ఒకటి అకస్మాత్తుగా విరిగి ఆటోపై పడింది. ఆటో ముందు భాగం నుజ్జవడంతో పాటు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో పరిసర ప్రాంత చిరు వ్యాపారులు, ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీశారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాజువాక ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చెట్టును తొలగించి, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని