logo
Updated : 22 May 2022 05:29 IST

అప్పన్న స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. నగరంతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రానికి చెందిన భక్తులు పెద్దఎత్తున సింహగిరికి తరలివచ్చారు. భక్తుల రాకతో దర్శనం క్యూలైన్లు, కేశఖండనశాల, గంగధార, ప్రసాదాల విక్రయశాలలు కిటకిటలాడాయి. సుమారు 30వేల మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామిని దర్శించుకున్నట్లు అంచనా. దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ.23.16లక్షల ఆదాయం సమకూరింది. కేశఖండన శాల ద్వారా రూ.2.74లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.9.88లక్షలు, ఆర్జిత సేవల ద్వారా రూ.96వేలు ఆదాయం వచ్చింది. 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని